Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె దేశాల మధ్య అవగాహనకు కృషి చేశారు. కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పడంతో పాటు ఎన్నో పుస్తకాలను రచించారు. ఆమె హెలెన్ ఫోస్టర్ స్నో. అమెరికాలో జన్మించి చైనాలో జర్నలిస్టుగా పనిచేస్తూ.. చైనాలో సామాజిక మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. చైనాలో పారిశ్రామిక సహకార సంఘాల గుంగ్-హౌ(వర్క్ టు గెదర్)ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. చైనా అమెరికన్ పౌర యుద్ధం, కొరియా స్వాతంత్య్ర ఉద్యమం, సెకండ్ సైనో-జపాన్ యుద్ధం తదితర అంశాలపై చైనా నుండి రిపోర్టింగ్ చేసిన అమెరికన్ జర్నలిస్టు.
సెడార్ సిటీ, ఉతాలో... హెలెన్ ఫోస్టర్ జన్మించారు. ఉతా యూనివర్సిటీలో, బీజింగ్‌లోని యాన్జింగ్, క్వింగైవా విశ్వవిద్యాలయాలలో ఆమె తన ఉన్నతవిద్యను పూర్తి చేశారు. జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆమె చైనాలోని అనేక ప్రాంతాలో పర్యటించారు. 1930లో చైనాలో సామాజిక మార్పు తీసుకురావడానికి ఆమె ఎంతో కృషి చేశారు. విప్లవం, యుద్ధం, అమెరికన్-చైనీస్ మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి రాసిన వ్యాఖ్యానం ఎంతో ప్రముఖమైనవి.
1930లో షాంఘైలో పారిశ్రామిక సహకార సంఘాల గుంగ్-హౌ (వర్క్ టుగెదర్) ఉద్యమాన్ని సృష్టించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. వామపక్ష జర్నలిస్టు ఎడ్గార్ స్నోతో కలిసి చైనాలో మార్పుకోసం ఉద్యమించారు. వీరిద్దరు కలిసి ''రెడ్ స్టార్ ఓవర్ చైనా'' రాసారు. సామాజిక మార్పు దిశగా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే కావడంతో వారు పెళ్లి చేసుకున్నారు. చైనా పౌర యుద్ధం, జపాన్ దండయాత్రను భర్తతో కలిసి రిపోర్ట్ చేశారు. ఆమె పుస్తకం ''ఇన్సైడ్ రెడ్ చైనా'' ఎంతో ప్రాచుర్యం పొందింది. అనేక పుస్తకాలు రచించిన హెలెన్ మావో జెడాంగ్, అతని సహచరులను ఇంటర్వ్యూ చేయడానికి ఎంతో రిస్క్ తీసుకున్నారు. ఆమె రాసిన చివరి పుస్తకం, ఆటోబయోగ్రఫీ ''మై చైనా ఇయర్స్: ఎ మెమోయిర్'' (1984).
హెలెన్, ఎడ్గార్లు చైనీస్ పారిశ్రామిక సహకార సంఘాలను ప్రారంభించటానికి కృషి చేశారు, యుద్ధ కాలంలో (1937-1945) జపనీయుల ఆక్రమణ ఉన్నప్పటికీ చైనా ఆర్ధిక వ్యవస్థ బలపడేందుకు కృషి చేశారు. చైనాలో పారిశ్రామిక సహకార సంస్థల ఏర్పాటుపై ఆమెకున్న ఆసక్తిని తన పుస్తకంలో ''మై చైనా చైనా ఇయర్స్'' 1984 లో వివరించారు. ఈ పుస్తకాన్ని చైనీయుల భాషలో రాసారు. ఆమె 'నమ్ వేల్స్' మారుపేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. రెండవ ప్రపంచ యుద్దం వరకు ఆమె చైనాలోనే ఉండిపోయారు. ఆమె తిరిగి యుఎస్‌కు వచ్చారు.
ఆమె మరణం తరువాత, చైనా సొసైటీ ఫర్ పీపుల్స్ ఫ్రెండ్షిప్ స్టడీస్ హెలెన్ జ్ఞాపకార్థం చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్‌ఫిప్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్‌ను ఏర్పాటు చేయబడింది. గ్రేట్ హాల్లో బీజింగ్‌లోని గ్రేట్ హాల్లో నిర్వహించబడిన ఈ సమావేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప
హెలెన్ ఫోస్టెర్ స్నో
(21సెప్టెంబరు, 1907-11 జనవరి,1997)