Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాలకులను మసాలా కూరల్లో, తీపి వంటకాల్లో వాడతారు. యాలకులకు సువాసనతోపాటూ మరెన్నో ప్రత్యేక సుగుణాలున్నాయి. అవి మనకు ఆరోగ్యపరంగానే కాదు, అందానికి కూడా తోడ్పడతాయి. యాలకుల ఉపయోగాలను గురించి తెలుసుకుందా..!
యాలకుల్లో మాంసకత్తులూ, పీచు, పిండిపదార్థాలతోపాటూ మరెన్నో పోషకాలు ఉంటాయి. యాలకుల్లో ఇనుము, రాగి, విటమిన్-సి, రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తాయి. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడి, పసుపు, చక్కెర వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
అలాగే యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియంలతోపాటు కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది.
యాలకులు ఆకలినీ పెంచుతాయి. వికారం, వాంతి వంటి లక్షణాలు ఉన్న వారు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు సరిపోతుంది.
అలాగే గొంతునొప్పితో బాధపడుతన్న వారు ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు యాలకులు వేసి బాగా మరిగించి ఉదయాన్నే పుక్కిలిస్తే త్వరగా ఉపశమనం పొందుతారు.
యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతుంది. యాలకుల నూనెను పెదాలకు పెట్టుకోవడం వల్ల అందంగా, మృదువుగా కనిపిస్తాయి.