Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గోడలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టం. పెన్సిల్ చేతిలో ఉందంటే చాలు గోడల మీద గీతలు గీయడం, క్రేయాన్‌తో రంగులు వేయడం చేస్తుంటారు. గోడల మీద ఉన్న మరకలను, రంగులను శుభ్రం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
గోడల మీద పడిన మరగలను తొలగించడంలో వెనిగర్ పాత్ర కీలకం. గోడలకు అతికించుకున్న వాల్ పేపర్లను శుభ్రంగా తొలగించుకోరువడానికి వెనిగర్‌ను ఉపయోగిస్తే చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా వెనిగర్ కలుపుకొని ఒక క్లాత్‌ను తీసుకొని ఈ నీటిలో ముంచి శుభ్రంగా తుడిస్తే మరకలు తొలగిపోతాయి.
బాగా మొండిగా ఉన్న మరకలను తొలగించుకోవాలంటే ఆ ప్రదేశంలో వెనిగర్ ద్రావణాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత అదే నీటితో కడిగితే సరిపోతుంది. వెనిగర్ నీటిని ఒక స్ప్రే సీసాలో నిల్వ ఉంచుకుంటే మంచిది.
ఒక బకెట్ గోరు వెచ్చటి నీటిలో బేకింగ్ సోడా, రెండు చెంచాల వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మరకలు ఎక్కువగా ఉన్న గోడలకు స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసిన 20 నిమిషాల తర్వాత ఒక శుభ్రమైన తడిబట్టతో ఆ ప్రదేశాన్ని తుడిస్తే సరిపోతుంది. రీన