Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుండ్రు సమస్య అధికంగా ఉంటే ఇలా చేయండి. గుడ్డులోని తెల్ల సొనను జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో కడిగితే సరిపోతుంది. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే చుండ్రు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. అలాగే జుట్టు చాలా మృదువుగా, పొడవుగా పెరుగుతుంది.
ఒక అరటిపండు గుజ్జులో, ఒక గుడ్డు, మూడు చెంచాల పాలు, మూడు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించిన తర్వాత, షాంపూతో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తొలగిపోయి కురులు పొడవుగా పెరుగుతాయి.
ఒక కప్పులో గుడ్డులోని తెల్లసొనను తీసుకొని దాంట్లో ఐదు చెంచాల ఆలివ్ నూనెను వెసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా కడిగితే సరిపోతుంది.
గుడ్డులోని తెల్లసొనలో నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన తర్వాత షాంపూతో శుభ్రంగా కడిగితే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
ఒక కప్పులో మూడు చెంచాల గోరింటాకు పొడిని, ఐదు చెంచాల తేనె, ఒక చెంచా టీ పొడి, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన గంట తర్వాత షాంపూతో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు బలంగా, పొడవుగా, దఢంగా పెరుగుతుంది.
ఉసిరికాయ రసంలో మూడు చెంచాల నిమ్మ రసం కలిపి కుదుళ్లకు పట్టించాలి. అర గంట తర్వాత నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. ప