Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిలను చున్నీలు, చీరకొంగులు పట్టిలాగి వేధించేవాళ్లను మనం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలల్లో ఆడపిల్లలు పెనుగులాడి తమ దుస్తులను దుండగుల చేతుల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తారు. దాడి నుంచి బయటపడటమే కాకుండా ఎదురుదాడి చేయడం నేర్చుకోవాలి. గత వారం వెనకవైపు నుంచి చున్నీ పట్టి లాగిన వ్యక్తిని ఎదుర్కొవడానికి ఉపయోగించిన టెక్నిక్స్ తెలుసుకున్నాం. ఈ వారం మరో రకమైన టెక్నిక్స్ మనం నేర్చుకుందాం..!
రోడ్డుపై నడుచు కుంటూ వెళ్లుతున్న అమ్మాయికి ఎదురుగా వచ్చిన ఒక ఆకతాయి.. దారికి అడ్డం నిలిచాడు. అంతేకాదు ఆమె వేసుకున్న చున్నీ పట్టిలాగాడు. మరింత ముందుకు వచ్చి ఆమెపై దాడి చేయబోయడు.
చున్నీని విడిపించుకునే ప్రయత్నం చేస్తారు చాలా మంది అమ్మాయిలు. కానీ, మీరుకుడిచేతి పిడికిలి బిగించి ఎడమ చేతితో చున్నీని పట్టుకున్న చేయిని లాక్ చేయాలి. మీరు పిడికిలి బిగించగానే ఆ ఆకతాయి మీరు ఏం చేయ బోతున్నారో అని భయపడతాడు.
ఇప్పుడు మీరు ఆ ఆకతాయి ఊహించని విధంగా అటాక్ చేయాలి. ఎడమచేతితో అతని జుట్టు పట్టి వెనక్కి వంచాలి. ఊహించని పరిణామంతో అతను వెనక్కి వంగిపోతాడు.
వెనువెంటనే మీ కుడిచేతి మోచేతితో అతని గొంతు లేదా ఛాతిపై అటాక్ చేయాలి. అంతే బాధతో మెలికలు తిరుగుతూ మీ చున్నీని వదిలేస్తాడు. మీ చేతిలో చిక్కిన అతని జుట్టును వదిలేస్తే అక్కడి నుంచి పరుగుతీస్తాడు.
ఎన్ని చట్టాలు వచ్చినా.. అడుగడుగున నిఘా కెమెరాలున్నా మహిళలపై వేధింపులు తగ్గలేదు. వీటిని నివారించాలంటే ఆడపిల్లల్లో చైతన్యం రావాలి. తమపై జరిగే దాడులను తిప్పికొట్టాలి. అప్పుడే ఆడపిల్లలపై చేయి వేయాలంటే కాదు.. వారి వైపు చూడాలంటేనే భయపడాలి.
- ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నెేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170, 9949039049
- రమేశ్