Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాల్కమ్ పౌడర్. పౌడర్ అనగానే పరిమళాన్నిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది అనుకుంటాం. తరాలుగా ఉపయోగిస్తున్నా... మనం చాలా తక్కువగా అంచనా వేసే కాస్మొటిక్. కానీ అంతకుమించిన ఉపయోగాలు పౌడర్‌లో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కొద్దిమందికి జుట్టు తొందరగా జిడ్డుగా మారుతుంది. అలాగని రోజూ తలస్నానం చేయలేం. ప్రత్యేకించి ఎప్పుడైనా అకస్మాత్తుగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ జిడ్డు జుట్టు ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడే పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. పౌడర్ తీసుకుని జుట్టు కుదుళ్లలో వేయండి. తరువాత దువ్వెనతో మిగిలినదంతా బయటికి వెళ్లేటట్టు దువ్వేయండి. జట్టులో ఉన్న ఆయిల్‌ను తీసేసి... తాజాగా చేసేస్తుంది.
కనురెప్పలు చాలా మందికి చాలా పలుచగా తక్కువగా ఉంటాయి. అలాంటివాళ్లు కొద్దిగా బేబీ పౌడర్‌ను తీసుకుని కనురెప్పలకు రాయండి. ఇది రెప్పలు మందంగా, పొడవుగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది. ఇక మస్కారా వంటి వాటి అవసరమే రాదు.
చర్మంపై అదనంగా ఉన్న వెంట్రుకలు తీసేయడానికి వాక్సింగ్ ఉపయోగిస్తుంటారు చాలా మంది. అది చేసేటప్పుడు నొప్పి కలుగుతుంది. నొప్పి రాకుండా ఉండాలంటే వాక్సింగ్ చేయడానికి ముందు చర్మంపై పౌడర్ చల్లండి. చర్మం మీద తేమను పీల్చుకుని వెంట్రుకలు సులభంగా వచ్చేందుకు ఉపయోగపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది.
బీచ్‌కు వెళ్లినప్పుడు లేదంటే ఇసుకలో ఆడుకున్నప్పుడు ఇసుక ఒంటికి పట్టి అస్సలు వదలదు. ఇలాంటప్పుడు చర్మంపై టాల్కమ్ పౌడర్ వేసి తుడిస్తే చాలు... సులభంగా తొలగిపోతుంది.
లెగ్గింగ్స్, టైట్ జీన్సులు తొడుక్కునేటప్పుడు మడమల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. లెగ్గింగ్, జీన్సును సులభంగా తొడుక్కోవాలంటే... పాదాలు, మడమపై కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేయండి. అంతే!