Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్త వయసు పై బడగానే మోకాళ్ల నొప్పులు రావడం సహజం. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీని కారణాలు చాలా ఉన్నా ప్రతిరోజు చేసే పనుల వల్ల కూడా సమస్య ఎక్కువగా వస్తుందని చెబుతు న్నారు నిపుణులు. మోకాళ్ల నొప్పులను నుంచి ఉపశమనం పొందాలంటే కింది అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది.
ఎక్కువ బరువు ఉన్న బ్యాగులను శరీరం బ్యాలెన్స్ చేయలేదు. ఒకవేళ చేసినా కండరాలు ఒత్తిడికి గురికావడం, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. అయితే తక్షణం కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం దీర్ఘకాలం తర్వాత పని చేస్తుంది. కాబట్టి ఎక్కువ బరువు ఉన్న బ్యాగులను క్రమం తప్పకుండా మోయడం వల్ల ఈ సమస్య ఎక్కువవుతుంది. ఈ అలవాటును కాస్త మార్చుకుంటే సరిపోతుంది.
ప్రతిరోజు మోకాళ్లకు సంబంధించిన వ్యాయామం తప్పని సరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలాగే మోకాళ్ల పై ఉండే ఒత్తిడి కూడా తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం శరీర బరువు తగ్గడంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
మోకాళ్ల నొప్పులను సులభంగా తగ్గించుకోవాలంటే వాకింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తే త్వరగా మోకాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం హై హీల్స్ వేసుకోవడం. ఎత్తుగా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల మోకాళ్లపై బరువు ఎక్కువగా పడుతుంది. ఫలితంగా కండరాలు ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి హై హిల్స్‌ను వేసుకోకపోవడం ఉత్తమం.
నిద్ర సరిగ్గా లేకపోయినా, ప్రయాణాలు ఎక్కువగా చేసినా కీళ్ల దగ్గర ఉండే కండరాలు త్వరగా ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి సమయానికి నిద్రపోవడం, వ్యాయామం చేయడం తప్పని సరి అంటున్నారు నిపుణులు. ు