Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యారెట్స్ చూడటానికి చాలా అందంగా కనిపించినా... చాలామంది పిల్లలు క్యారెట్స్‌ను తినడానికి ఇష్టపడరు. అలా తినలేని వారికి వాటిని చిన్న చిన్న ముక్కలుగా, జ్యూసుల రూపంలో ఇవ్వాలి. క్యారెట్స్‌లో బిటా-కెరొటిన్స్¸, విటమిన్ 'ఎ', ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా క్యారెట్స్‌ను తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దీని పాత్ర కీలకం.
పిల్లలు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే క్యారెట్స్‌ను తినిపించండి. ఇవి కంటి చూపును మెరుగుపర్చుతాయి. విటమిన్ 'ఎ' దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. ఇవి కంటి చూపుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఒకవేళ క్యారెట్స్ తినని వారు క్యారెట్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఒక కప్పు నీటిలో పది నిమిషాలు ఉడికించుకొని దానిపై సబ్జి మసాలా చల్లుకొని తింటే చాలా రుచి ఉంటాయి.
బాగా ఆకలిగా ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు క్యారెట్స్ తింటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన భావన కలుగుతుంది.
జీర్ణ సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారు క్యారెట్స్ తింటే సరిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
వీటిలో ఉండే పొటాషియం ఆందోళనను తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా క్యారెట్స్ గుండెను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అలాగే క్యారెట్స్‌లో ఉండే బీటా-కెరోటిన్స్, ల్యూటిన్, లైకోపిన్ లు చర్మాన్ని అందంగా తయారు చేస్తాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ు