Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరితో అనుబంధం ఏర్పర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ దాన్ని సుదీర్ఘ కాలంపాటు కొనసాగించడమే కష్టం. ఈ క్రమంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తొలి రోజుల్లో కలిసి ఉన్నప్పుడు ఉన్నంత ఆనందంగా ఏడాదంతా ఉంటామని చెప్పలేం. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలి వానలా మారి దూరం పెంచుతాయి. ఇది భార్యా భర్తల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఒక్కటైన ఇద్దరు కాస్తా మళ్లీ విడిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలా కాకుండా.. మీ రిలేషన్షిప్ సాఫీగా సాగాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
కొందరు తమ పార్టనర్‌ను ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ.. ఒక్కోసారి మాత్రం తమను తాము నియంత్రించుకోలేక పోతుంటారు. చిన్న చిన్న కారణాలకే తిట్టడం, విమర్శించడం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదనే సంగతి గుర్తుంచుకోండి. మీ ఇగో మీ అనుంబంధాన్ని డామినేట్ చేయకుండా జాగ్రత్త పడండి. మీదే ఎప్పుడూ పై చేయి కావాలి అని మాత్రం అనుకోకండి. సర్దుకుపోవడానికి ప్రయత్నించండి.
మీ భాగస్వామి చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. ఒకరు చెప్పేది మరొకరు వినడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఎంత కోపంలో ఉన్నా సరే.. తను చెప్పే విషయాలను వినండి. ఇద్దరి మధ్య గొడవలు జరిగితే.. తప్పు తనదే అయినా సరే.. ముందుగా సారీ చెప్పడానికి సంకోచించకండి.
ఎప్పుడూ ఆఫీసు పనితో బిజీగా ఉండటమే కాదు.. తనను బయటకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే. వీకెండ్స్‌లోనే, వాలెంటైన్స్ డే నాడో.. ఇద్దరూ కలిసి సినిమాకెళ్లండి. బయటే ఏ రెస్టారెంట్లోనే ఫుడ్ లాగించేయండి. ఇతర ఆలోచనలన్నీ పక్కనబెట్టి ఇద్దరూ కలిసి మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లండి. కలిసి ప్రయాణించడం వల్ల మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ౖ