Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్ 'ఇ' అందాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఔషధ గుణాలను కలిగిన మంచి యాంటీ ఆక్సిడెంట్. కురుల, చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
బాగా ముడతలు ఉన్నవారు ఇలా చేస్తే ముడతల నుంచి ఉపశమనం పొందుతారు. విటమిన్ 'ఇ' నూనెను మర్ధన చేస్తే సరిపోతుంది. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్. పొడిబారిన చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
ముఖంపై ఉండే మచ్చలు, గీతలు తగ్గించడంలో ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. విటమిన్ ఇ క్యాప్సిల్ను సగం తీసుకొని నేరుగా గీతలు, మచ్చలు ఉన్న ప్రాంతంలో రుద్దితే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
గాయపడినా, కాలిన ప్రదేశాల్లో విటమిన్ ఇ నూనెను రాసుకుంటే మంట నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ఇది మంటను తగ్గించడంతో పాటు కాలిన మచ్చలను తొలగిస్తుంది.
పెదాలు బాగా పగిలినా, చర్మం పొడి బారినా విటమిన్ ఇ క్యాప్సిల్ను రాసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
కాలుష్యం కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే ఇలా చేయాలి. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ నూనెను కలిపిన నూనెను తలకు నిండుగా పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచిది. చుండ్రు సమస్యను దూరం చేయడంలో విటమిన్ ఇ బాగా పని చేస్తుంది. ు