Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు టీనేజ్లో అడుగుపెడుతున్నపుడు వారిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులను అర్థం చేసుకోలేక చాలా మంది తల్లిదండ్రులు వారిని నిందిస్తుంటారు. అయితే మీరు అనే మాటలు కొన్ని సందర్భాలలో పిల్లలకు బాధ కలిగించవచ్చు. వాటి అన్నింటిని మీరు పరిష్కారం చూపాలి. అప్పుడే వారు సరైన మార్గంలో నడవగలరు. అంతేకాని వారిపై పెత్తనం చలాయిస్తున్నట్లు, అణిచిపెట్టే విధంగా మాట్లాడితే వారి వయసు ఊరుకోదు. మనసు అంతకన్నా ఊరుకోదు.
చెప్పడం మానుకోండి
మీ పిల్లలు ఏదైనా సొంతంగా ఇష్టపడితే కచ్చితంగా మీ పిల్లలు టీనేజ్ లేదా కౌమార దశలోకి ప్రవేశించారని చెప్పవచ్చు. ఆ సమయంలో వారికి మీకు నచ్చిన పనులే చేయమని చెప్పటం మానుకోండి. మీరు మేము చెప్పినట్లే చేయాలి. మాకు కట్టుబడి ఉండాలి. వంటి మాటలు వారితో అనకూడదు. వారి ఇష్టాలను గౌరవించండి.
ఇతరులతో పోల్చకండి
తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను ఇతరులతో అనవసర పోలికలు తెస్తూ ఉంటారు. ముఖ్యంగా పరీక్షలు, మార్కుల విషయంలో. ఐతే మీరు పిల్లలను ఎంతో ప్రేమిస్తున్నారనే విషయాన్నీ మర్చిపోవద్దు. ఇది ముఖ్యంగా టీనేజ్ పిల్లలను వ్యవహరించే సమయంలో... వారికి ఇష్టం లేని పనిని కచ్చితంగా చేయవల్సిందే అని పట్టుపట్టకండి. ముఖ్యంగా ఇతర పిల్లలతో మీ పిల్లలను పోల్చడం వలన, మీ పిల్లలు మీ గురించి చెడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు.
ఒత్తిడి ఉండకూడదు
వారు కౌమార దశలో ఉన్నప్పుడు పిల్లల మీదఒత్తిడి ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే అది వారిని అబద్దం ఆడేవిధంగా, మోసం చేసేవారిగా తయారు చేస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే స్నేహపూర్వక పద్ధతిలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి.
అనుమానం వద్దు
మీరు వారిని అనుమానంగా చూడటం మానుకోండి. అంతేకాక వారు చేసే పనులను రహస్యంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. టీనేజ్ పిల్లలలో అంచనాలు, నిర్ణయాల ఏర్పాటు చాలా త్వరగా ఉంటాయి.మీరు ఒక పేరెంట్ కాబట్టి, మీకు వారి ప్రవర్తనపై అనుమానం కలిగినపుడు సూటిగా వారిని ప్రశ్నించకుండా స్నేహపూర్వకంగా మెలగాలి. ు