Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కురులు అందంగా, మృదువుగా కనిపించాలంటే నూనె తప్పని సరి! తలకు నూనె సరిగ్గా పట్టించకుంటే వెంట్రుకలు నిర్జీవంగా కనిపిస్తాయి. వెంట్రుకలకు నూనె ఎలా పడితే అలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నూనె పట్టించే విధానాన్ని బట్టి కురులు కాంతివంతంగా, పొడవుగా పెరుగుతాయి, అవేంటో తెలుసుకుందాం!
చల్లటి లేదా గోరు వెచ్చటి నూనెను కురులకు పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చాలా తేడా కనిపిస్తుంది. గోరు వెచ్చటి నూనెను ముని వేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకుంటూ తలకు నూనె పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
తలకు నూనె పట్టించేటప్పుడు వేళ్లతో బలంగా వెంట్రుకలను రుదొద్దు. ఇలా చేస్తే ఎక్కువగా వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి నూనెను చాలా మృదువు, గుండ్రంగా తిప్పుకుంటూ మర్దన చేస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి.
నూనె పట్టించిన వెంటనే తలస్నానం చేయడం, దువ్వడం వంటివి చేయకూడదు. అలా చేస్తే జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంది. అందుకే నూనె పట్టించిన అరగంట తర్వాత దువ్వడం లేదా స్నానం చేయడం మంచిది.
చాలామంది వెంట్రుకలకు, తలకు మాత్రమే నూనెను బాగా పట్టించి కుదుళ్లను మరిచిపోతారు. అలా కాకుండా కుదుళ్లకు కూడా నూనె పట్టిస్తే జుట్టు మొత్తంగా హైడ్రేట్ అవుతుంది.
తలస్నానానికి మరీ వేడి నీటిని ఉపయోగించవద్దు. గోరు వెచ్చటి నీటిని ఉపయోగించడం మంచిది.