Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిఫ్రిజిరెేటర్ను వారానికి లేదా నెలకు ఎన్నిసార్లు శుభ్రపరుస్తున్నారు. సాధారణంగా పైపైన దులిపి వస్తువులను సర్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూరగాయలు పాడవటం, దుర్వాసన రావడం, ఇతర ఆహారపదార్థాలకు బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చి చేరతాయి. కాబట్టి రిఫ్రిజిరెేటర్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కీలకం.
ఉదాహరణకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మాంసం, వెన్న ఇలా అన్ని పదార్థాలను వేరు వేరు డబ్బాల్లో పెట్టాలి. ఇలా చేస్తే పాడవకుండా ఉంటాయి. అన్నింటిని కలిపి ఒకే దగ్గర పడితే త్వరగా పాడవుతాయి. అలాగే డబ్బాల్లో పెట్టే ముందు తడి లేకుండా చూసుకోవడం కీలకం.
ఏదైన బాటిల్ లేదా జార్, కంటైనర్ ను ఫ్రిజ్‌లో పెడితే వాటి మూతలు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే వాటిలో ఉండే పదార్థాలు ఉష్ణోగ్రతను తట్టుకోలేక పాడవుతాయి.
ఎక్కువగా ఉపయోగించే వాటిని గ్లాసు కంటైనర్, పాల బాటిల్, పండ్లను ఫ్రిజ్ ముందు భాగంలో ఉంచుకోవాలి. ఎందుకంటే తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.
ఫ్రిజ్‌లో దుర్వాసన ఎక్కువగా వస్తుంటే బ్రెడ్ ముక్కలను పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ దుర్వాసనను పీల్చుకొని మంచి వాసనను వెదజల్లుతుంది. అలాగే శుభ్రం చేసేటప్పుడు ఒక కప్పు నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్ క్లాత్‌ను ముంచి ఫ్రిజ్‌ను తడి లేకుండా తుడిస్తే సరిపోతుంది. ు