Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెమట మరకల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెమట ఎక్కువగా భుజాల కింది భాగంలో వస్తుంది. కాబట్టి డ్రెస్‌పై మరకలు కూడా ప్రత్యేకంగా అక్కడే కనిపిస్తాయి. ఆ మరకలు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. పోని వాటిని తొలగించుకుందామనుకుంటే సమయం, సందర్భం మన ఆధీనంలో ఉండవు. చెమట మరకలను తొలగించుకోవడానికి కొన్ని ట్రిక్స్‌ను ఫాలో అయితే సరిపోతుంది.
షర్ట్ కింది భాగంలో చెమట మరకలు ఎక్కువగా కనిపిస్తుంటే లోపల కాటన్ ఇన్నర్ వేసుకోవడం లేదా పౌడర్ ఎక్కువగా వాడటం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల చెమటను పీల్చుకునే అవకాశం ఉంటుంది.
బట్టలకు పర్ఫ్యూమ్ వేసుకోవడం వల్ల కూడా చెమట వాసన, మరకలు కనిపించకుండా ఉంటాయి. అల్యూమినియం తక్కువ మోతాదులో ఉండే పర్ఫ్యూమ్లను ఉపయోగించడం మంచిది.
చెమట మరకలు ఎక్కువగా ఉంటే పొడిగా ఉన్న బట్టతో తుడుచుకొని కొద్దిగా పౌడర్ చల్లుకుంటే సరిపోతుంది.
అలాగే వేడి నీటిలో లేదా గోరు వెచ్చటి నీటిలో అరగంట సమయం నానబెట్టి సబ్బుతో ఉతికితే మంచి ఫలితం కనిపిస్తుంది. ు