Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కలను పెంచడానికి ఇష్టపడేవారు వాటి సంరక్షణకు అవసరమైన వస్తువులను కూడా అంతే జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. మొక్కలకు అవసరమైన మట్టి, ఎరువులు, నూనెలు ఇలా ప్రతి ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. చాలా ఇష్టంగా పెంచుకున్న మొక్క పెరగకుండా అలాగే ఉంటే ఎంతో బాధేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!
మొక్కకు అవసరమైన ఎరువును ఇలా తయారు చేసుకోండి. వృథాగా ఉన్న కుండలో మట్టిని తీసుకొని దాంట్లో లూబ్రికేటింగ్ ఆయిల్, కూరగాయల నూనెను పోసి బాగా కలుపుకోవాలి. ఈ మట్టిని ఉపయోగించకుండా అలాగే కొద్ది రోజులు ఉంచుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కుండీలో వేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఎరువును ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటే మంచిది.
అలాగే చిన్న పరిమాణంలో ఉండే బకెట్, కాటన్ క్లాత్, ఇనుప కడ్డి, హ్యాండిల్ ఉన్న బ్లేడ్, కత్తెర ఇలా అవసరమైన వాటిని అందుబాటులో ఉంచుకోవాలి.
మొక్కలు బాగా పెరిగితే... వాటి చివర్లను చేతితో తుంచకుండా... కత్తెరతో కట్ చేయడం మంచిది. దాంతో పాటు మొక్క పెరుగుదలకు పురుగుల మందుకు బదులుగా వేప నూనె, సర్ఫ్ వాటర్ ఉపయోగించాలి.