Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ స్లైస్‌లు తినడం వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అందుతాయి. గోధుమల్లో న్యూట్రీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ బ్రెడ్ స్లైస్‌లను సాయంత్రం పూట స్నాక్స్ మాదిరి తీసుకున్న ఆరోగ్య పరంగా ఎదురైయ్యే కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు.
బ్రౌన్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్రెడ్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే తక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
అలాగే మొత్తంగా గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ తీసుకుంటే 49 శాతం శరీర బరువును అదుపులో ఉంటుంది.
బ్రౌన్ బ్రెడ్‌లో విటమిన్ 'బి', 'ఇ', మెగ్నీషియం, పాస్పరస్, జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ 'ఇ', 'బి' లు మానసిక ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు ప్రశాతంతను అందిస్తాయట.
బ్రౌన్ బ్రెడ్‌లో ఉండే ఫొలెట్ కణాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
బ్రెడ్‌ను నేరుగా తీనడానికి ఇష్టపడని వారు వాటిని నెయ్యిలో దొరగా వేయించి తినడం లేదా జామ్ రాసుకొని తినడం లేదా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం మంచిది. ఇలా చేసుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది.