Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిడ్నీలో రాళ్లు ఉన్నవి అని తెలియగానే చాలామంది భయపడిపోతుంటారు. రాళ్లను తొలగించుకోవడానికి పెద్దగా ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు. మరీ ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. సహజ సిద్ధంగా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ప్రతిరోజు 8-10 గ్లాసుల నీటిని తాగడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు, రాళ్లు తొలగిపోతాయి. అలాగే శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
అలాగే సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
రోజు తీసుకునే ఆహారంలో క్యాల్షియం రెండు శాతం ఉండేలా చూసుకోవాలి. ఒక కప్పు పాలల్లో 300 మిల్లీగామ్రుల క్యాల్షియం ఉంటుంది. ఇది ముఖ్యంగా కిడ్నీలోని రాళ్లను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటు కిడ్నీలోను రాళ్లు కరిగే అవకాశం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు, మాంసం, గింజలు, చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ట