Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆందోళన మానసికంగానే కాదు... శారీరకంగా కూడా ప్రమాదకరం. కాబట్టి ఆందోళనకు గల లక్షణాలను గుర్తించి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే సమతుల ఆహారం తీసుకోవడం, కెఫీన్, నూనె, పిండి, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉంటే సరిపోతుంది.
ఆందోళనను అదుపులో ఉంచడంలో మెగ్నీషియం పాత్ర కీలకం అని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. పాలకూర, పప్పులు, గింజలు, చిరు ధాన్యాలు ఎక్కువగా తినడం మంచిది. జీడిపప్పు, కాలేయం, గుడ్డులోని ఉండే జింక్ కూడా ఆందోళనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలను నెలలో రెండుసార్లు తినాలి. ఇది ఒత్తిడి, భయం, ఆందోళన ను తగ్గిస్తాయి.
పెరుగు, నిల్వ పచ్చళ్ల వంటి ప్రొబయోటిక్ పదార్థాలను తీసుకోవడం వల్ల ఆందోళన లక్షణాలు దూరం అవుతాయి.
విటమిన్ 'బి' మానసిక ఉల్లాసాన్ని కలిగించే సెరటోనిన్, డొపమైన్ల ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆకుకూరలు, చిరు ధాన్యాలు, బఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్, చేపలు వంటివి తరచుగా తినటం మంచిది. ట