Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వార్డ్రోబ్లో బట్టలు ఎక్కువైతే సర్దడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది! బట్టలు ఎక్కువైతే ఏ డ్రస్ వేసుకోవాలో తెలిదు. అనుకున్న డ్రస్ సమయానికి దొరకదు. అలాంటప్పుడు చాలా చిరగ్గా, గందరగోళంగా అనిపిస్తుంది. పాత దుస్తులు బిగ్గరా, చిరిగితే తప్ప కొత్తవాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. అలాగే పాత దుస్తులును వెరే వాళ్లకు ఇద్దామన్న, బయట పెట్టాలన్న మనసొప్పదు. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
కంటికి నచ్చినవన్నీ కొన్కుకోవడం డబ్బులు, సమయం వృథా అవుతాయి. దుస్తులు కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి. కొత్త, పాత జతలు ఎన్ని ఉన్నాయని. వాటిలో చిరిగినవి, మరీ బిగుతుగా అయినవి... ఇలా ఆలోచించుకొని కొత్త బట్టలు కొనడం మంచిది. లేదంటే కొన్న తర్వాత ఇబ్బంది పడాల్సివస్తుంది.
ఇక వారానికి ఒకసారి వార్డ్రోబ్ను సర్దుకోవడం మంచిది. పాత దుస్తులను, చిరిగిన వాటిని బయటికి తీసి డోర్ మ్యాట్స్, లేదా కిచెన్ క్లాత్స్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వార్డ్రోబ్లో కొన్ని బట్టలు ఖాళీ అవుతాయి.
అలాగే వార్డ్రోబ్లో బట్టలు పెట్టే ముందు ఇస్త్రీ చేయడం మంచిది. దాంతో పాటు దుస్తుల కింద నాప్తలిన్ ఉండలు వేసుకోవడం మంచిది. ు