Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళ్లు, భుజాలు, ముఖం, చేతులపై ఉండే వెంట్రుకలను తొలగించుకోవడానికి ప్రతిసారి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజ సిద్ధమైన షేవింగ్ క్రీమ్‌లను ఉపయోగించి షేవ్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి షేవింగ్ క్రీమ్స్ మీ కోసం...
- చర్మం బేబి ఆయిల్‌ను త్వరగా పీల్చుకుంటుంది. కాబట్టి షేవింగ్ చేసేటప్పుడు చర్మానికి ముందుగా బేబి ఆయిల్ పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
- హెయిర్ కండీషనర్, మాయిశ్చరైజర్లు కూడా మంచి షేవింగ్ క్రీమ్‌లుగా పని చేస్తాయి. మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత షేవింగ్ చేస్తే చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.
- కలబంద మాయిశ్చరైజర్ కన్నా ఎక్కువ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని చర్మానికి రాసుకొని షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మృదువుగా తొలగిపోతాయి. అలాగే చర్మాన్ని హైడ్రేట్ కూడా చేస్తాయి.
- బాడి లోషన్, మాయిశ్చరైజర్ కూడా షేవింగ్ క్రీమ్‌లుగా పని చేస్తాయి. బాడీ లోషన్‌ను చర్మానికి పట్టిస్తే చర్మం మెత్తగా, మృదువుగా మారుతుంది. బాడి లోషన్‌ను చర్మానికి పట్టించి పది నిమిషాల తర్వాత షేవింగ్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
- కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్‌ను కలిపి చర్మానికి నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పది నిమిషాల తర్వాత షేవింగ్ చేస్తే చర్మం పై ఉన్న వెంట్రుకలు మృదువుగా తొలగిపోతాయి. ు