Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయ వేడుకలకు అద్భుతమైన కళను, హుందాతనాన్ని తెచ్చిపెడతాయి ఎంబ్రాయిడరీ లాంగ్ స్లీవ్స్. ఇక స్లీవ్స్ రంగు ఏదైనా కానీ వాటి మీద కనిపించే జువెలరీ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లేత గోధుమ రంగులో ఉండే సిల్క్ క్లాత్ పైన గులాబీ రంగు పువ్వులు, పట్టు వర్క్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఎరుపు రంగు నెట్టెడ్ లాంగ్ స్లీవ్ మీద సన్నగా, అందంగా తీర్చిదిద్దిన ఫ్యాబ్రిక్ వర్క్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ లో కనిపించే లాంగ్ స్లీవ్స్ను ఓ సారి ప్రయత్నించి చూడండి!