Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో వృథాగా ఉండే పాత సాక్స్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం!
కొత్త ఇంటికి మారేటప్పుడు చిన్నగా ఉండే గాజు వస్తువులను నేరుగా కాకుండా సాక్స్‌ల్లో మడిచి పెడితే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల వాటి అంచులు దెబ్బతినకుండా ఉంటాయి.
మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పి తీవ్రంగా ఉంటే కొన్ని బార్లీ గింజలను బాగా వేడి చేసి పాత సాక్స్‌ల్లో నింపి నొప్పి ఉన్న ప్రాంతంలో అటుఇటూ ఐదు నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది.
కంప్యూటర్ కీ బోర్డును శుభ్రం చేసుకోవడానికి కూడా సాక్స్‌లు ఉపయోగపడతాయి. సగం కప్పు నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి సాక్స్‌ను దాంట్లో ముంచి డెస్క్‌ను, మానిటర్‌ను శుభ్రంగా తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.
ఇంట్లో ఉంటే టేబుల్, కుర్చీలు ఓ చోట నుంచి మరోచోటుకి కదిలించేటప్పుడు వాటి కాళ్లకు సాక్స్‌లు తొడిగిస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటితోపాటూ ఇచ్చే సిలికా బ్యాగులన్నింటినీ ఒక సాక్స్‌లో వేసి దాన్ని కిటికీ దగ్గర వేలాడదీస్తే గదిలో ఉన్న తేమని పీల్చుకుని గదిని వెచ్చగా ఉంచుతుంది.
బూట్లు పాలిష్ చేసుకోవడానికి కూడా సాక్స్‌లను వాడొచ్చు. వీటితో శుభ్రం చేస్తే బూట్లు కొత్తవాటిలా కనిపిస్తాయి.
సబ్బు నీటిలో సాక్స్‌లను ముంచి అద్దాలను, తలుపులను, కిటికీలను, పింగాణీ వస్తువులను శుభ్రం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప