Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోకో ఛానెల్
(19 ఆగస్టు 1883- 10 జనవరి 1971)
ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని మహిళ కోకో ఛానెల్. 1839 అలిగేలో జన్మించారు. కోకో వాళ్ళ అమ్మా ఇంటి పనులు చేసుకుంటూ జీవనం గడిపేది. ఆరుగురు సంతానంలో కోకో ఒకరు. ఈమె జన్మించగానే తల్లి చనిపోగా తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ఇక కోకో తన 17 ఏండ్ల వయసులో చిన్న ఉద్యోగం వదలి కాబరే డాన్సర్‌గా జీవనం సాగించడం మొదలుపెట్టింది. పర్షియన్ హౌటల్లో పాడుతూ ప్రేక్షకులను అలరించేది. ఆమె పాడిన ''కోకో'' అనే పాట ప్రసిద్ధి కావడంతో ఆమెను ''కోకో'' అనే మారు పేరుతో పిలిచేవారు. అయితే ఆమె నృత్యం ఎక్కువకాలం ఏమీ చేయలేదు.
తరువాత స్నేహితుల సహకారంతో స్వంతగా మొదట అలంకరణశాల నెలకొల్సింది. వస్త్రాభరణాల వ్యాపారం ప్రారంభించి దానిలో తలకు ధరించే టోపీ బదులు మెత్తనైన ఊలుటోపి తయారు చేసి పాత బరువైన హాట్ కింద ఉండే మెదడు సునిశితంగా ఎలా పని చేస్తుంది''? అని ప్రశ్నించేది. అంతేకాక వ్యాపార విస్తరణలో ఆమె చాలా తెలివైనది. 1920లో ఆమెకు ప్యాషన్ ప్రపంచంలో గొప్ప పేరొచ్చింది. ఆమెకు హాలివుడ్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఆమె విజయాలు ఆమెను గొప్ప కళాకారుల సరసన చేర్చాయి. స్ట్రావిన్స్కి, పికాసో, కాక్టీర్, డయాగిలిర్ లాంటి కళాకారులు ఆమె దుస్తుల ప్రపంచంలో తెచ్చిన విప్లవాన్ని కళావిప్లవంగా శ్లాఘించారు. అలాగే నూతన దుస్తుల ఛానల్ సూట్ ఉత్పత్తి చేసింది. ఇప్పటికీ దానికి అనుకరణలు రావడం దాని ప్రసిద్ధతకు తార్కాణం. మోకాళ్ల వరకూ స్కర్ట్, అందులో నల్లటి పువ్వులతో అలంకరించబడిన జాకెట్, బంగారు గుండీలు అమర్చబడి దానిపై వజ్రాలు పొదగబడినాయి. కాలంతో పాటు ఆమె తయారు చేసిన నమూనాలు ప్రసిద్ధికెక్కి ఫ్యాసన్కి కోకో ఛానల్ అనే మారు పేయ్యింది. కోకో జీవిత చారిత్ర మీద 1981 లో ''ఛానల్ సోలిటైర్'' అనే చిత్రం నిర్మించారు. ఆమె మరణానంతరం ఆమె స్థాపించిన సంస్థలను ఆమె వద్ద పని చేసిన ఉద్యోగులే కొంత కాలం నిర్వహించారు. ఆమె ఎన్నడూ స్త్రీవాదినని చెప్పుకోక పోయినా స్త్రీలకు తయారు చేసిన దుస్తుల నమూనాలు స్త్రీ వాదానికి బలం చేకూర్చాయి.