Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెల్లో దిగమింగుకోలేని బాధ కావొచ్చు.. పైకి చెప్పుకోలేని ప్రాబ్లం ఉండొచ్చు.. పరిష్కారానికి నోచుకోని సమస్య అయినా కావొచ్చు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకు ఈ అశాంతి కలిగించిన వారి మీద కోపం రావొచ్చు. కానీ కంట్రోల్లో ఉండండి. ఆ కసినంతా మీరు చేసే పనిపై పెట్టండి. మీరు ఉన్న రంగంలో రాణించేందుకు ఆ ఎమోషన్ ఉపయోగించుకోండి. శత్రువు నీ కళ్లముందే పకపకనవ్వుతూ ఉండొచ్చు. అయినా పట్టించుకోకండి. జీవితంలో ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వస్తుంటాయి. ఆ సందర్భంలో కాస్త కూల్‌గా ఆలోచించండి. కాసేపు ఒంటిరిగా కూర్చొని మీలోని గ్రేట్ నెస్ ఏమిటో ఓ పేపర్ పై రాసుకోండి. నేను ఎందులో ఎవ్వరికీ తక్కువకాను అని మీకు మీరే ప్రశంసించుకోండి. బాధగా అనిపించిన సమయంలో ఇంకా మీరు చేయాల్సిన పలు విషయాలు మీకోసం.
- మీరు ఉన్న ప్రస్తుత పరిస్థితిపై జడ్జిమెంట్ తీసుకోవాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. ఇందులో మీకు ఎవరూ పూర్తిగా సహకరించలేరు. మీ ఆప్తులు కూడా సలహాలు మాత్రమే ఇవ్వగలరు కానీ ఈ నిర్ణయం తీసుకో అని చెప్పలేరు కదా. అందుకే నిర్ణయం నీపైనే ఆధారపడి ఉంటుంది.
- ఒక గదిలోకి వెళ్లి ఒక్కరే కూర్చొని ఓ పేపర్ పై మీలోని గ్రేట్ ఫుల్ లిస్ట్‌ను అంతా రాయండి. కనీనం మీలోని ఓ ఇరవై పాజిటివ్ అంశాలు పేపర్ పై పెట్టండి. మీ మైండ్‌లోని పాజిటివ్ పాయింట్స్ మొత్తం దానిపైకి వస్తాయి. మీ మైండ్ మార్చేందుకు మీలో పాజిటివ్ ఎనర్జీ తెచ్చేందుకు ఇదొక మంచి ఎక్సర్ సైజ్.
- ఒక్కసారి ఏదైనా అనవసర నిర్ణయాలు తీసుకుంటే జీవితం నాశనం అవుతుంది. ఏదో చిన్నపాటి విషయం వల్ల మీ జీవితాన్ని ఫణంగా పెట్టకండి. నిర్భయంగా ముందుకెళ్లండి. సమస్యను పరిష్కరించుకోండి.
- జాబ్ నుంచి బయటకు వచ్చే విషయంలో ఎలాంటి తొందరపాటి నిర్ణయం తీసుకోకండి . మీరు ఇంటికే పరిమితమైతే మీపై మరింత బర్డెన్స్ పెరుగుతాయనే విషయం గుర్తుంచుకోండి. సమస్యను ఎక్కడికక్కడే మరిచిపోండి.
- మీరు బాధలో ఉండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రన్నింగ్ చేయండి. జాయింగ్కు వెళ్లండి. గేమ్స్ ఆడండి. డిప్రెషన్ లోకి వెళ్లకండి.
- గతాన్ని మరిచిపోండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. భయాన్ని తొలగించుకోండి. ధైర్యంగా ముందుకెళ్లండి. మీ కలలను సాకారం చేసుకోండి.
- మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీకు తోడ్పాటు అందిస్తారు. మీరు ఉన్న పరిస్థితుల్లో వారి సహకారం ఎంతైనా అవసరం. వాళ్లతో కలిసిమెలిసి మాట్లాడండి. మీ బాధను చెప్పుకోండి.