Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలను షాపింగ్ కు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రులకు భయం. ఎందుకంటే మొండిగా ప్రవర్తిస్తారు. 'ఇది కొనివ్వ లేదంటే ఇంటికి రాను' అని అక్కడే కూర్చోని ఏడుస్తుంటారు. అలా మొండిగా ప్రవర్తించే పిల్లలతో కింది విధంగా మెలిగితే సరిపోతుంది.
- పిల్లలకు అవసరమైనవి కొనిస్తే సరిపెట్టుకోరు. పక్కవారివి కూడా కావాలని మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో వారి మనసు నొప్పించకుండా నెమ్మదిగా చెప్పండి. 'నీతో ఉన్న వస్తువులు నీ స్నేహితుల వద్ద లేవు కదా! మరెందుకు అవి మనకు అవసరం లేదు చిన్నా' అని చెబితే చక్కగా వింటారు.
- ఇంట్లో ఇద్దరు చిన్నారులుంటే పెద్దవారు సున్నితంగా, చిన్నవారు మరీ మొండిగా ప్రవర్తిస్తారు. అలా మొండిగా ప్రవర్తించే పిల్లలకు కాస్త భయం పెట్టడంలో తప్పేం లేదు. వాళ్లు ఏ ఏ విషయాల్లో మొండికేస్తున్నారో గమనించుకుంటే సరిపోతుంది.
- ఇంటి నుంచి షాపింగ్ కు వెళ్లేముందు పిల్లలతో మనం ఇవి మాత్రమే కొనుక్కోవడానికి వెళ్తున్నాం అని చెబితే సరిపోతుంది. ట