Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండ్ల ముంగిళ్ళలో ఇంద్ర ధనుస్సులు
రంగవల్లులై పరుచుకుంటున్న సంబురం
గగనాన బాల్యాలు
గాలిపటమై ఎగురుతున్న సంబురం
పల్లెసుద్దుల పలుకులతో
డూ.. డూ బసవల విన్యాసపు సంబురం
పాతకు గోరీ కడుతూ..
కొత్తకూ భేరీ కొడుతూ..
భోగి మంటల భాగ్యాలకు
యువత సయ్యాటల సంబురం
కాల గమనంలో కరిగిపోతున్న
హరిదాసు ఆటపాటలు
మచ్చుకు చూస్తున్న సంబురం
అన్నీ మారుతున్నారు..
మసక బారుతున్నారు..
పచ్చని పల్లెల్ని జల్లెడ పట్టుకోవాలేమో..
ఎన్ని రంగుల ఎన్ని హంగుల
పెద్ద పండుగొచ్చినా..
పెద్దనోట్ల రద్దుల పద్దు
రైతుకు కానరాని వెలుగుల పొద్దు
పండిన పంటకు లేదు గిట్టుబాటు
వండిన వంటపైనే తిరుగుబాటు
పెద్ద పండుగ ఇప్పుడు పెద్దోళ్ల పండుగ..!
కడు పేదవాడి కడగండ్లు తీరి
కాంతులు చిమ్మినప్పుడే సంక్రాంతి..!
- కటుకోఝ్వల రమేష్
9949083327