Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వచ్ఛమైన గాలిని అందించే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే ఇంటికి సరికొత్త అందం రావడమే కాకుండా ఇంట్లో మంచి ఆహ్లాదపూరిత వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఇంట్లో గుబురు మొక్కలు ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. స్వచ్ఛమైన గాలిని అందించడటంలో వీటిదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు.
గుబురు మొక్కలు 24 గంటల్లోనే గాలిలోని 87 శాతం కాలుష్యాన్ని తొలగిస్తాయి. ఇండోర్ ప్లాంట్స్‌లో పెంచే మొక్కలకు నేరుగా సూర్యరశ్మి పెద్దగా అవసరం ఉండదు. అలాగే వాటి గురించి ప్రతి రోజూ శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే చూసేందుకు మాత్రం ఆ మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. ఇంటి డిజైనింగ్‌లను బట్టి, స్థలాన్ని బట్టి రకరకాల డిజైనర్ కుండీలలో మొక్కలను పెంచితే ఆ ఇల్లు పచ్చదనంతో కళకళ లాడుతుంది.
పామ్, పెరోమియా, మనీప్లాంట్ వంటి మొక్కలకు తక్కువ సూర్యరశ్మి సరిపోతుంది. పామ్ మొక్కను చిన్న కుండీలో నాటి, కావాల్సిన ఎత్తు పెరిగాక కత్తిరిస్తుండాలి. ఇక మనీప్లాంట్స్ బంగారు వర్ణం, ఆకుపచ్చ, ఫిలో డెండ్రాన్... అనే మూడు రకాలు లభిస్తుంటాయి. వీటిలో ఏరకం అయినా తెచ్చి పెంచుకోవచ్చు.
స్థలం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వెడల్పాటి కుండీలో వేర్వేరు రకాలకు చెందిన ఐదారు మొక్కలను నాటుకోవడం మంచిది. మీరు మొక్కలు పెంచబోయే కుండీలలో రంగు రంగుల గోళీలు, చిన్న సైజు బమ్మల వంటివి కూడా పెడితే చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీ యంగా ఉంటాయి.
మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసు కోవాల్సి ఉంటుంది. అవేంటంటే... మొక్కల్ని ఎప్పుడూ ఒకే చోట, ఒకే కోణం లో ఉంచకూడదు. ఒకటి, రెండు వారాల కోసారి వాటిని తిప్పుతూ ఉండాలి. కొని ఇళ్లల్లో ఇండోర్ ప్లాంట్స్ ఆకులు రాలి పోతూ ఇంటి యజమానులకు తెగ చికాకును తెప్పిస్తాయి. మొక్కలకు నీరు ఎక్కువైనా తక్కువైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవు తాయి. కాబట్టి నీటి విషయంలో సమతుల్యం అవసరమని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.