Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొబ్బరి నూనె వల్ల జట్టు సున్నితంగా, మృదువుగా తయారవుతుంది. ఇది సహజ సిద్ధమైన కండీషనర్. దీని వల్ల ఎలాంటి సౌడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు పొడిబారినా, బలహీనంగా ఉన్న కొబ్బరి నూనెను బాగా రుద్దటం వల్ల కురులు దృఢంగా, పొడవుగా పెరుగుతాయి.
వెంట్రుకలు ఊడిపోవటం, చిట్లిపోవటం, బలహీనపడటాన్ని నిరోధిస్తుంది కొబ్బరి నూనె. ఇది జుట్టును మృదువుగా ఉంచడంతో పాటు జుట్టు ఊడటాన్ని ఆపుతుంది. కుదుళ్ళకు బలాన్ని చేకుర్చుతుంది.
కొబ్బరి నూనెను జుట్టుకు క్రమం తప్పకుండా రాయటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది. సాధారణంగా కేశాలు పొడిబారి, దుమ్ము, దూళి కణాలు చేరడం వల్ల కూడా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి సమయంలో కొబ్బరి నూనెను పట్టించడం ద్వారా వెంట్రుకలకు తగినంత తేమ అందుతుంది.
చుండ్రుతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు వెంట్రుకలను కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని పొద్దున్నే తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
జుట్టు చిన్నగా ఉన్న కూడా కొంత మందికి చిక్కులు ఎక్కువగా పడతాయి. అలాంటి వారు కురులకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనె రాసుకుంటే చిక్కుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.