Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీర బరువును తగ్గించుకోవడానికి కొన్ని ఉత్తతమైన మార్గాలను ఎంచుకొని వాటిని కచ్చితంగా ఫాలో అయితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం...
బ్రెడ్, రోటీని క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది శరీర బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోటీ, బ్రెడ్‌లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మల్టీగ్రేయిన్, బ్రౌన్ బ్రెడ్, గోధుమ బ్రెడ్‌ను ఎంచుకుంటే మంచిది.
ప్రతిరోజు 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, పండ్ల రసాలను, కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగాలి.
రోజుకు ఏడు లేదా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించొచ్చు. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
వీలైనంత వరకు వేపుళ్ళకు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు శరీర బరువును పెంచడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయి. రి