Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంలో ఎక్కువయిన సీబం, మృతకణాలు ముఖ రంధ్రాలను పూడ్చేయడం ద్వారా బ్లాక్‌హెడ్స్ వస్తాయి. బ్లాక్‌హెడ్స్ ముఖాన్ని అందవిహీనంగా చేస్తాయి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణాలు తెలుసుకుంటే వాటిని నివారించుకోవడం చాలా సులువు అవుతుంది.
చర్మానికి అంటుకున్న దుమ్ము వల్ల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనికి తోడు ముఖంలో ఉన్న జిడ్డు వల్ల బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గిల్లకూడదు. అలా గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపల చేరి మరింత హాని చేస్తుంది.
ముల్లంగిని జ్యూస్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నీటిని బాగా వేడిచేసుకుని అందులో వంట సోడా వేసి కలపాలి. అలా కలిపిన నీటిని ముఖంపై దూదితో అప్లై చేయాలి. ఇలా చేయడం ద్వారా కొంత వరకు బ్లాక్ హెడ్స్‌ను నివారించుకోవచ్చు.
ఒక కప్పు పెరుగులో కొంచెం పంచదార వేసి ముఖానికి స్క్రబ్‌లా పెట్టుకుంటే బ్లాక్ హెడ్స్ నుండి విముక్తి పొందవచ్చు. గంధపు చెక్క పొడిలో కొంచెం గులాబీ నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి ఒక ప్యాక్‌లా వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.
బియ్యం పిండిని కూడా స్క్రబ్‌లా వాడుకోవచ్చు. బియ్యం పిండిని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట బాగా రుద్దుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఒక కప్పులో ఓట్స్‌ని తీసుకుని అందులో గులాబీ నీటిని కలుపుకోవాలి. ఆ పేస్ట్‌ను బ్లాక్ హెడ్స్ ఉన్నచోట వేళ్లతో మర్ధన చేసుకోవాలి. ఇలా చేసుకున్న 15 నిమిషాల తర్వాత ప్యాక్‌ను శుభ్రంగా కడిగితే మంచిది.
కొత్తిమీర రసంలో కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేసుకుంటే బ్లాక్ హెడ్స్ నుండి పూర్తి ఉపశమనం పొందవచ్చు.
ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. రి