Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిమ్‌కు వెళ్లే ముందు కొంతమంది ఏమీ తినరు.. మరి కొందరు ఎలాగో కసరత్తులు చేస్తాం కదా అని ఇష్టమైన ఆహారం లాగించేస్తారు. కానీ ఆ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జిమ్ ప్రయోజనం ఉండదు.
ఓట్స్‌ను తీసుకోవడం వల్ల పిండిపదార్థాలు శరీరంలోకి నెమ్మదిగా విడుదలవుతాయి. అంటే కసరత్తులు చేస్తున్నంతసేపు ఉత్సాహంగా ఉండటానికి కావల్సిన శక్తి వస్తూ ఉంటుంది. ఒకేసారి అలిసిపోయినట్లు అనిపించదు. అందుకే జిమ్‌కు వెళ్లే ముందు ఒక గిన్నె నిండా ఓట్స్ తిని చూడండి.
అరటిపండ్లలో పొటాషియం, త్వరగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పైగా కావల్సిన శక్తి కూడా అందుతుంది.
గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. రెండు గుడ్ల తెల్లసొనలో 8 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. పైగా కొవ్వు సమస్య ఉండదు.
నిద్ర లేవగానే జిమ్‌కు వెళ్తుంటే ఖాళీకడుపున కాకుండా ఒక గిన్నెనిండా పెరుగు తిని చూడండి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
గుడ్డు తినని వారు కూరగాయలూ, సెనగపిండీ కలిపి దోసెలా వేసుకుని తినొచ్చు. దీంట్లో వీలైనన్ని ఎక్కువ కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి.
యాపిల్ముక్కలూ, పీనట్ బటర్ కలిపి తింటే ఒక కొత్త రుచి మన నోటికి పరిచయం చేసినట్లే. ఇవి తినడం వల్ల శరీరానికి కావల్సిన పిండిపదార్థాలూ, మాంసకృత్తులు శరీరానికి అందుతాయి. ున