Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసును హాయిగా ఉంచుకోవాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవాలను ఏదో ఒక పని మీద నిమగం చేసుకోవాలి. అప్పుడే జీవితం అందంగా, ఆరోగ్యంగా, హాయిగా గడుస్తుంది. అలాంటి మధురానుభుతిని కలిగించే కొన్ని సూచనలు మీ కోసం....
ఒక మంచి పుస్తకం చదవండి.
ఇష్టమైన సినిమా చూడండి.
చేసే పని మీద దృష్టి పెట్టడండి.
పెయింటింగ్ వేయడం లేదా ఫొటోలు దిగండి వంటివి చేయండి.
పది నిమిషాలు లక్ష్యాన్ని కల కనండి.
కంటితో చూసిన ప్రతి దాన్ని మెదడులో పదిలంగా దాచుకోండి.
చుట్టూ వినపడే శబ్దాలను ఎంజారు చేయండి.
ఇష్టమైన సంగీతాన్ని కాసేపు వినండి.
సముద్రపు అలలు చేసే సంగీతాన్ని మౌనంగా ఆస్వాదించండి.
రెేడియోలో వచ్చే వార్తలను, పాటలను ఆలకించండి.
ఇంట్లో ఉదయాన్నే సైలెంట్ మ్యూజిక్‌ను పెట్టుకోండి.
ఇష్టమైన పాటలు పాడుకోండి.
పెద్దగా, మనస్ఫూర్తిగా, హాయిగా నవ్వుకోండి.
చాక్లెట్ లేదా చూయింగమ్ నములుతూ ఉండండి.
శ్వాస సంబంధిత వ్యాయామం చేయండి.
ఇతరులు చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి.
కథలు, కవితలు చదువుకోండి
సుగంధభరితమైన నూనెలను ఉపయోగించండి.
ఇంట్లో మంచి వాసన వచ్చే క్యాండిల్స్‌ను వెలిగించుకోండి.
మట్టి వాసనను, మల్లె పూలు వెదజల్లే వాసనను ఆస్వాదించండి.
రుచికరమైన పదార్థాలను స్వయంగా చేసుకోండి.
ఉదయాన్నే వేడి వేడి కాఫీ లేదా టీ ని హాయిగా ఆస్వాదించండి.
కాసేపు అలా వ్యాయామం చేయండి.
పెంపుడు జంతువులతో ఆడుకోండి.
కంఫర్టుగా ఉన్న బట్టలను ధరించండి.
సంగీత వాయిద్యాలతో సరదాగా ఆడుకోండి.
హాయిగా కవితలు రాసుకోండి.