Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుండ్రు సమస్యతో ఇబ్బందిపడే వారు ఎన్నో రకాల షాంపూలను ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే అలా చేయడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చుండ్రు నివారణకు సహజ సిద్ధంగా ఉండే నిమ్మనూనె, తులసి నూనె, టీ ట్రీ నూనె వంటివి ఉపయోగించటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు నిపుణులు.
నిమ్మకాయ నూనె: నిమ్మలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. జిడ్డును, అంటువ్యాధులను నివారిస్తుంది. అలాగే నిమ్మ నూనె జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్న వారు వారానికి మూడు సార్లు నిమ్మకాయ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది.
టీ ట్రీ నూనె: ఇది ప్రకృతి సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తుంది. దురదను, చుండ్రును తొలగించటంలో దీని పాత్ర కీలకం. టీ ట్రీ నూనెలో జోజోబా, ఆలివ్ నూనెలను కలిపి తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
తులసి నూనె: చుండ్రును నివారించటంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. చర్మ సంరక్షణకు, జుట్టు పెరగటానికి తులసి నూనె చాలా ఉపయోగపడుతుంది. ు