Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు నుంచి ఐదేండ్ల వయసులో ఉన్న చిన్నారులకు మంచి అలవాట్లను ఎలా నేర్పించాలి.. వారితో ఏం మాట్లాడాలి... ఎలా మాట్లాడాలి... అనే ప్రశ్నలు చాలామంది తల్లిదండ్రులకు వస్తాయి. ఆ వయసులోనే పిల్లలు చాలా ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి మంచి అలవాట్లను నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల్లో ..కొన్ని మీ చిన్నారుల కోసం...
రెండు నుంచి ఐదు సంవత్సరాల చిన్నారులు ఎక్కువగా చూడటం ద్వారా, ముఖకవళికల ద్వారా, హావభావాల ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అలాంటి కొన్ని హావభావాలను చూద్దాం... బాగా ఆకలిగా ఉంటే చిన్నారులు ఏడుస్తారు. అలా ఏడిస్తే విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు కాబట్టి బాగా ఆకలిగా ఉందని చెప్పడానికి నోట్లోకి చేయి పెట్టి చూపించండి. ఆ అలవాటే చిన్నారులు కూడా నేర్చుకుంటారు.
బాగా దాహంగా ఉన్నప్పుడు బొటనవేలును నోట్లోకి పెట్టి చూపిస్తే చాలు వాళ్లు అదే అలవాటును స్కూల్లో కూడా కొనసాగిస్తారు.
ఏదైన ఎక్కువగా తినాలనిపిస్తే... ఇంకా ఏదో అడగాలని అనుకుంటే రెండు చేతులను దగ్గరకు పెట్టి చూపిస్తే సరి! ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నరని అర్థం చేసుకోవచ్చు.
ఇతరుల నుంచి ఏదైన సహాయం కొరితే వెంటేనే ప్లీజ్ అనడం లేదా దయచేసి ఇది ఇవ్వండి లేదా చేసి పెట్టడండని చెప్పడం నేర్పించాలి. ఇది కృతజ్ఞాత భావనకు గుర్తు. దయచేసి అనే పదం వాడేటప్పుడు ఎడమ చేతిని ఎద మీద పెట్టుకోవాలి.
స్నేహితులు, బంధువులు ఏమైన గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు ధన్యవాదాలు లేదా థ్యాంక్స్ చెప్పడం నేర్పించండి. థ్యాంక్స్ చెప్పడానికి కుడి చేతి వేళ్లను నోటి దగ్గర పెట్టుకొని తల కొద్దిగా వంచితే సరిపోతుంది.
ఏదైన తప్పు చేసినప్పుడు సారీ లేదా క్షమించండని చెప్పడానికి కుడి చేతిని ఎద మీద పెట్టుకొని తల కొద్దిగా కిందకు దించితే సరిపోతుంది. ఈ హావభావాలు చిన్నతనం నుంచే నేర్పించడం వల్ల పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. భవిష్యత్లో చిన్నారులకు ఎంతగానో తోడ్పడతాయి. ు