Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి అందాలను చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. కొన్నిసార్లు వాటిని వర్ణించడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. ప్రకృతిలో లభించే చిన్నపుల్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వృక్షాల వరకు ఎన్నో అపురూపమైన వస్తువులను తయారు చేసుకోవచ్చు. ప్రకృతి చాటున దాచుకున్న అందాలను మనముందు విరబూస్తుయిన్నవి అగ్గిపుల్లలు. వాటితో ఎన్నో అబ్బురపరిచే బొమ్మలను, ఆకట్టుకునే వస్తువులను స్వయంగా చేసుకోవచ్చు... క్యాండిల్ పైకి నిచ్చెన వేయడం, పెద్ద పెద్ద వస్తువులను మోయడం, తల్లిదండ్రులు పిల్లలను ఆడించడం, సాయంత్రపూట సరదాగా సైకిల్ తొక్కడం, సంగీత వాయిద్యాలతో ఆడుకోవడం, వంతెన దాటడం, వానలో తడవకుండా అరటి ఆకును ఉపయోగించడం.. ఇవన్నీ కేవలం అగ్గిపుల్లతో తయారు చేసిన కళాకృతులు. ఇక అవి చేసే అందాలను చూస్తే మనసు ముచ్చటపడక తప్పదు. అలాంటి కొన్ని బొమ్మలు మీ కోసం...