Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్పు సహజమైనటువంటి ప్రక్రియ. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. అంతే కాదు మార్పు లేకపోతే జీవనం విధానం చాలా ఇబ్బందికరం. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉండాలంటే మార్పు తప్పని సరి!
పనులను వాయిదా వేసుకోవడం వల్ల ఒక రకమైన బద్ధకానికి గురవుతున్నారు. బద్ధకం కారణంగా ఎన్నో పనులు వాయిదా పడటం క్రమంగా తలనొప్పిగా మారడం సహజం. కాని, పనులను వాయిదా వేసుకోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం బద్ధకం. ఇది అన్నింటి కంటే భయకరమైన జబ్జు. ఈ రోజు చేసే పనిని రేపు చేద్దాం అని వాయిదా వేసుకునే వారు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. దీని నుంచి బయపడాలంటే మన అలవాట్లను, బాధ్యతలను మార్చుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఎప్పటి పని అప్పుడు చేయడం అనే ఒక కొత్త అలవాటును బాధ్యతగా స్వీకరించి అనుసరించాలి. పనులను వాయిదాలు వేయడానికి గల కారణాలు... 'ఫిెయర్ ఆఫ్ ఫెయిల్, వాయిదాలు వేయడం, సమయం వృథా చేయడం, ప్రతి దానికి ఏదో ఒక వంక చెప్పడం వంటివి. ఇవి ఒకరమైన భయకరమైన బద్ధకానికి దారి తీస్తాయి. జీవితం లో మార్పును కోరుకునే వారు పై కారణాలను సున్నితంగా తొలగించుకుంటే మార్పు దానంతట అదే వస్తుంది. ు