Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటి అలంకరణలో పరదాల పాత్ర ప్రత్యేకం. వివిధ వర్ణాల మేళవింపుతో విభిన్నంగా కనిపించే పరదాలు ఇంటికే కొత్తందాన్ని తెస్తాయి. అయితే వీటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా వాడకంలోనూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.
రోజంతా పని ఒత్తిడితో అలసిన మనసుకు ఆహ్లాదం కలిగించేలా పడకగది ఉంటే ఎంతో హాయి. పెద్ద పెద్ద డిజైన్లతో ముదురు వర్ణాల్లోని పరదాలను ఎంచుకుంటే మంచిది. ఇతర గదులకు పసుపూ, పచ్చ, ఎరుపుతో పాటూ ఊదాను వాడవచ్చు.
పరదాలను ఎంపిక చేసుకునేప్పుడు ఏ గదికి వాడబోతున్నారో, ఎండ ఎంతమేరకు పడుతుందో పరిశీలించాలి. లేదంటే వేడి నుంచి రక్షణ కలగదు సరికదా రంగూ పోతాయి.
పరదాలు ఉతికే నీటిలో డిటర్జంట్తో పాటూ, నాలుగు చెంచాల నిమ్మరసం, కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తే రంగు వెలిసి పోకుండా ఉంటాయి. సువాసనలూ వెదజల్లుతాయి. ు