Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో చాలామందిని పట్టిపీస్తున్న సమస్య నిద్ర. పడుకోగానే నిద్ర పట్టడం లేదని! నిద్ర పట్టడానికి గంటకు పైగా సమయం పడుతుందని! సరిగ్గా నిద్ర పోవడం లేదని బాధపడుతుంటారు. ఇక రాత్రి నిద్ర సరిగ్గా పడుకోకపోతే ఉదయాన్నే లేవడం కష్టంగా మారుతుంది. కంటి నిండా నిద్రలేకపోతే చేసే పనిలో ఇబ్బందిగా, ఒత్తిడిగా, అలసటగా అనిపిస్తుంది. పడుకోగానే నిద్రపట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, కండరాలు బిగుసుకుపోవడం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మైండ్ ఫుల్ బ్రీతింగ్ తప్పని సరి అంటున్నారు నిపుణులు.
శ్వాస సంబంధిత వ్యాయామం చేయడం వల్ల ఒక్క నిమిషంలోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. మైండ్ ఫుల్ బ్రీతింగ్ ఎక్ససైజ్ ఎలా చేయలో తెలుసుకుందాం... పడుకునే ముందు నేల మీద చాపను వేసుకొని దాంట్లో నిటారుగా కూర్చొని ముక్కుద్వారా గాలిని పీల్చుకొని నోటి ద్వారా నెమ్మదిగా వదలాలి. ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడంతో పాటు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా రోజు రాత్రి పడుకునే ముందు చేస్తే శరీరకండరాలు రిలాక్స్ అవుతాయి. ఇలా శ్వాస సంబంధిత వ్యాయామం చేయడం వల్ల నిద్రలోకి త్వరగా జారుకుంటారు. ఈ సూచనను పాటిస్తే నిద్రలేమి నుంచి బయటపడొచ్చు. చికాకు, అలసట, ఆందోళన ఉన్నప్పుడు ఈ ఎక్ససైజ్ను చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. నిద్ర లేమితో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ చిన్న చిట్కాను ప్రయత్నించి చూడండి! ు