Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుగులపరుగుల బిజీజీవితంలో రోజూ పొద్దున్నే వాకింగ్, జాగింగ్ అంటే చాలా కష్టం అంటారు ఎవరైనా.. కానీ, 30నిమిషాల నడక ద్వారా రోజంతా ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలిస్తే మాత్రం కచ్చితంగా నడుస్తారు. సౌత్ కరోలినా యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనల ప్రకారం వారానికి 5 రోజులపాటు వాకింగ్ చేస్తే శరీరంలోని హార్మోన్లను నియంత్రించి గర్భస్రావాలను నివారించవచ్చని స్పష్టమైంది. నడక ద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం 40శాతం తగ్గిపోతుంది అని తేలింది.
ఉత్సాహం మాత్రమే కాదు.. సంపూరా ్ణరోగ్యానికి నడక ఎంతో అవసరం. పొద్దున్నే అరగంట నడవడం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఈ 30 నిమిషాల నడక మీ జీవన గతినే మార్చేస్తుంది. డయాబెటిస్, ఒబేసిటీ, గుండె జబ్బులు ఉన్నవారికి తప్పనిసరి. నడకతో ఈ జబ్బుల తీవ్రత తగ్గించడంతో పాటు కండరాలకు, గుండెకు చాలా మంచిది. పొద్దున్నే వీచే చలిగాలి శరీరానికి తాకడంతో నరాలు ఉత్తేజితమవుతాయి. రోజంతా ఉత్సాహంగా, పాజిటివ్ థింకింగ్‌తో ఉండేందుకు నడక ఉపయోగపడుతుంది. పొద్దున్నే 30 నిమిషాల నడిస్తే.. రెండు గంటల పాటు జిమ్‌తో సమానమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కారణం.. తాజా గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉండటమే అని వివరిస్తున్నారు.
జీవనశైలి రుగ్మతల్లో ఒకటిగా మారిన డయాబెటిస్ రోజూ వాకింగ్ చేసేవారిలో వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ వచ్చిన వారిలో పొద్దున్నే నడకతో చాలావరకు కంట్రోల్ అవుతుంది.
అరగంట వాకింగ్‌తో రక్తపోటు తగ్గుతుంది. రక్తప్రసరణలో అడ్డంకులు రావు. గుండెజబ్బులు దరిచేరవు.
అధికబరువు సమస్యను ఎదుర్కొంటున్న వారు చేయాల్సిన అతి ముఖ్యమైన వ్యాయామం నడక. పైసా ఖర్చులేని వాకింగ్ ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. 30 నుంచి 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి క్యాలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. ఎలాంటి డైట్ నియమాలు పాటించకుండానే నడకతో బరువు తగ్గవచ్చు అన్నది నిపుణుల సూచన. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గితే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.