Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటి పనులు, ఆఫీసు పనుల్లో పడి చాలా మంది అమ్మాయిలు తమ ముఖం గురించి పట్టించుకోవడమే మరిచిపోతుంటారు. ఒకవేళ మేకప్ లాంటివి వేసుకున్నా రాత్రి పడుకునే ముందు శుభ్రం చేసుకోవడం మరిచిపోతారు. అలా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. ఆ సమస్యలెంటో చూద్దాం...
మొటిమలు: రాత్రిపూట మేకప్ తొలగించుకోకుండా పడుకుంటే మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మంపై ఉండే దుమ్ము, క్రిములు, బ్యాక్టీరియా చర్మ గ్రంధుల్లోకి వెళ్లి ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ. దీని వల్ల మొటిమలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి.
పొడి బారటం: మేకప్ రాత్రంత పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. అంతేకాక నిర్జీవంగా తయారవుతుంది. ముఖంపై ముడతలు ఏర్పడతాయి. ముఖ్యంగా మేకప్ తొలగించుకోకపోతే చర్మం వాతావరణంలోని తేమను గ్రహించదు. తద్వార చర్మం డిహైడ్రేట్ అయి నిర్జీవంగా కనిపిస్తుంది.
రసాయనాల ప్రభావం: చర్మతత్వాన్ని బట్టి మేకప్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు సున్నితమైన, పొడి చర్మం ఉన్నవారు సహజ సిద్ధమైన మేకప్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మేకప్ రిమూవర్: మేకప్‌ను సహజ సిద్ధంగా తొలగించుకోవడానికి ఎప్పుడు అందుబాటులో కొన్ని వస్తువులను దగ్గరగా ఉంచుకోవాలి. వాటిలో ఒకటి ప్రీ మాయిశ్చరైజర్, క్లీనింగ్ క్లాత్, మిసెల్లర్ వాటర్, ఆయిల్ క్లెన్సర్స్‌ను వెంట ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ు