Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎముకలు దృఢంగా, బలంగా ఉండటానికి విటమిన్లు, ఆకుకూరలు, విటమిన్ 'సి' ఎంతగానో సహాయపడతాయి. విటమిన్ 'సి' యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. దాంతో పాటు ఎముకలు విరిగిపోకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లో ఉండే పోషకాలు ఎముకల సాంద్రతను పెంచడంలో చాలా ఉపయోగపడతాయి.
ఎముకలు బలంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం, జంపింగ్, బరువులు ఎత్తడం, హైజంప్, షాట్ జంప్ వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఎముకలకు అవసరమైన పోషకాలు రెండు. ఒకటి క్యాల్షియం, రెండు ప్రోటీన్లు. క్యాల్షియం తగ్గితే ఎముకలు పలుచబడటం, పొలుసుగా మారడం, బలహీనంగా తయారవడం వంటివి జరుగుతాయి. కాబట్టి కచ్చితంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. పాలు, గుడ్లు, ఆకుకూరలు, వేరు శనగలు, పెరుగు వంటివి.
చిరు ధాన్యాలు, గింజలు, ఆకుకూరలలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి.
సూర్య కిరణాల నుంచి ముఖ్యంగా విటమిన్ 'డి' శరీరానికి అందుతుంది. ప్రతిరోజు ఉదయం వచ్చే ఎండలో 15 నిమిషాలు ఉంటే ఎముకలు విటమిన్ 'డి' ని గ్రహిస్తాయి. ఉదయం కాకుండా మధ్యహ్నం పూట ఎక్కువ సమయం ఎండలో ఉండటం వల్ల అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మపై పడి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ప్రతిరోజు ఒక చెంచా నువ్వులు తీసుకున్న ఎముకలకు అవసరమైన క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. దాంతో పాటు నువ్వుల నూనెతో 15 నిమిషాలు మసాజ్ చేసుకోవడం, గోరు వెచ్చటి పాలను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ు