Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్లెన్సింగ్: చర్మం సున్నితంగా ఉంటే ఏ రకమైన క్లెన్సింగ్ ప్రొడక్ట్ అయినా సరే చర్మానికి చిరాకు పెట్టిస్తుంది. కానీ పాలతో తయారుచేసిన క్లెన్సర్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి అందాన్ని అందిస్తుంది. పచ్చి పాలు చర్మాన్ని మెరిపించడంలో ఎంతగానో సహాయపడతాయి. పాలను చర్మ సంరక్షణ కోసం ఉపయోగించడం మంచిది. సగం కప్పు పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఎక్సఫ్లోయేటింగ్: పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ వల్ల ముఖం పై కనిపించే ముడుతలు మాయం అవుతాయి. పాలను ఎక్సఫ్లోయేట్ ఏజెంట్ గా ఉపయోగించు కోవచ్చు. ఒక బౌల్లో పచ్చిపాలను తీసుకొని కాటన్ బాల్ ను ముంచి ముఖం మీద ఆప్లై చేస్తూ మసాజ్ చేయాలి. ఇలా పది నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
మసాజ్: ముఖం , శరీరాన్ని పచ్చిపాలను ఉపయోగించి మసాజ్ చేసుకోవాలి. ఒక కప్పు పాలను బకెట్ నీటిలో మిక్స్ చేసి ఆ నీటితో స్నానం చేయాలి. దాంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
మొటిమలు: ముఖంలో ఉండే మొటిమలు, మచ్చలను తొలగించ డంలో పాలు బాగా పని చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ముఖానికి పచ్చిపాలను ఆఫ్లై చేసుకోవాలి. మర్నాడు పొద్దున శుభ్రంగా ముఖం కడుక్కుంటే ముడతలు, మొటిమలు దూరం అవుతాయి.
మాస్క్: ఒక చెంచా పెరుగులో రెండు చెంచాల పచ్చిపాలను కలిపి ముఖానికి ఆప్లై చేయాలి. పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.