Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించిన తర్వాత మహిళలు ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఆహార అలవాట్లలో కొంత మార్పు తప్పని సరి! ప్రెగెన్సీ సమయంలో డైట్‌తో పాటు యాక్టివ్ నెస్ కూడా ఉండాలి. దీంతో పెరిగిన బరువును ప్రసవం తర్వాత తగ్గించుకోవడం సులభం అవుతుంది.
- ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫ్యాట్స్, విటమిన్, మినరల్స్ నిండుగా ఉండేలా చూసుకోవాలి. ప్లేటులో సగం భాగం పండ్లు, సగం కూరగాయలు పెట్టుకొని తినండి. ఎక్కువ వేయించిన పదార్థాలకు, చక్కెర, ఉప్పు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
- ఫ్యాట్స్ అన్నీ చెడ్డవి కావు. కొన్ని మంచివి కూడా ఉంటాయి. ఉదాహరణకు 'శమోనో, పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్'. ఎక్కువ శాతం ద్రవరూప ఫ్యాట్స్‌లో ఆయిల్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గది ఉష్ణోగ్రతలో పేరుకుపోయే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను తొలగించుకోవాలి.
- భోజనాన్ని చిన్న చిన్న మీల్స్ రూపంలో తీసుకోవాలి. అంటే రెండు, మూడు గంటలకోసారి తీసుకోవాలి. ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
- మంచి నీళ్ళు బాగా తాగాలి. రోజుకు 10-12 గ్లాసులు తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ద్రవ పదార్థాల వల్ల డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- శరీరంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. దీని కోసం ఇరుగుపొరుగువారితో, కుటుంబసభ్యులతో కలసిమెలసి ఉండాలి.
- చక్కటి వ్యాయామం తప్పని సరి!ప్రెగెన్సీ సమయం నుంచి డెలివరీ తర్వాత కూడా వ్యాయామం చేయాలి. కాకపోతే డాక్టర్ సలహా మేరకు వ్యాయామం చేస్తే మంచిది.