Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని ఏండ్ల తరబడి వాడుతున్న వస్తువుల్లో ఏదో ఒకటి ప్రతీ ఇంట్లో ఉండటం సహజం. రెగ్యులర్ గా వాడేవే అయినా, వాటిని ఎలా వాడాలని, ఎన్ని రోజులు వాడొచ్చు అని తెలుసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా వాడేస్తూనే ఉంటాం. స్టీల్ గిన్నెలు, ఇత్తడి సామాన్లు కాకుండా సాధారణంగా అన్ని ఇళ్ళల్లో లభించే కొన్ని వస్తువులకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఆ వస్తువులని తెగ వాడేస్తుంటారు. ఇప్పుడు మీరు ఊహించని కొన్ని వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంటుందో తెలుకుందాం
పిల్లో: సరైన తలగడ లేకపోతే మంచి నిద్రను కోల్పోతారు. కొన్ని సార్లు మెడ నొప్పులు కూడా వస్తాయి, కాబట్టి తలగడని ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి మార్చాలి.
పాదరక్షలు: ఇంట్లో లేదా ఇంటి వద్ద ధరించే చెప్పులకు అధిక శాతంలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా వాష్ చేసినా సరే ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చాలి.
టవల్స్: తడిగా ఉన్న టవల్స్ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి టవల్స్ ను వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. అలాగే ఒక టవల్ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు.
టూత్ బ్రెష్‌లు: మనం రోజూ వాడే టూత్ బ్రెష్‌లు కనీసం మూడు నెలకొకసారి మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు .
లోదుస్తులు: లోదుస్తులు సంవత్సరానికొకసారైనా మార్చాల్సిందే..
జాగింగ్ షూస్: రెగ్యులర్ గా వాడే జాగింగ్ షూస్‌ని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు. వాటిలో ఉన్న కుషనింగ్ తగ్గిపోతుంది. కాబట్టి జాయింట్ పెయిన్స్ వస్తాయి.
హ్యాండ్ సానిటైజర్: బాటిల్ ను ఒకసారి తెరిచిన తర్వాత మూడు నెలలకన్నా ఎక్కువ పనిచేయదు. దాని పవర్ తగ్గిపోతుంది.
ఫెర్ఫ్యూమ్ బాటిల్స్: ఫెర్ఫ్యూమ్ బాటిల్స్ ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి.
దువ్వెనలు: దువ్వెనను వారానికొకసారి కనీసం 15రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి. అలాగే దువ్వెనని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు వాడకూడదు.
బాడీ స్పాంజ్ లేదా షవర్ పఫ్: బాడీ స్పాంజ్ లేదా షవర్ పఫ్ రోజూ వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే వీటిని ఆరునెలలకన్నా ఎక్కువ రోజులు వాడకూడదు. శ