Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటికి ప్లాస్టిక్ కిటికీలు పెడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఈ రకమైన వస్తువులకు ప్రత్యేకతనిస్తుంది. గ్లాస్ కిటికీల కంటే కూడా ప్లాస్టిక్ కిటికీలు బాగుంటున్నాయని సర్వేలో తేలింది. ప్లాస్టిక్ కిటికీల వలన ప్రయోజనాలెంటో చూద్దామా...
కిటికీల మీద గీతలు పడకుండా వుంటాయి. అధికమైన లైటింగ్ ఇంటిలోపలికి ప్రసరిస్తుంది. గ్లాస్ విండోలకంటే కూడా బలంగా వుంటాయి. అయితే వీటిని తరచుగా శుభ్రం చేయాల్సి వుంటుంది. శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ఒక బకెట్ సబ్బు నీటిలో మెత్తటి క్లాత్‌ను లేదా స్పాంజి ని తీసుకొని నీటిలో ముంచి మెల్లగా కిటికీలను తుడవాలి. మరో సారి మంచి నీటిలో ముంచి తుడిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల సబ్బు మరకలు కనపడవు. ఇంకా నీటి మరకలు కనిపించకుండా ఉండాలంటే మెత్తటి పొడి గుడ్డ తో మెల్లగా తుడిస్తే దుమ్ము, ధూళి పూర్తిగా తొలగిపోతుంది. ఈ చిట్కాలను ప్రతిరోజు పాటిస్తే కిటికీలు తళ తళ మెరుస్తాయి.