Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూడటానికి చిన్నగా కనిపించినా మన దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూడా ఇబ్బంది కలిగించే జీవులు చీమలు. ఇవి మన వంటగదిలో తిరుగుతూ తెగ చికాకు పెడతాయి. చీమలు ఇంటి పునాదు లను దెబ్బతీసిన సందర్భాలను కూడా మనం చూడొచ్చు. వేలాది చీమలు సైన్యంగా మనకు ఇష్టమైన ఆహార పదార్ధాలపై దండెత్తి రావడం మనకు తెలిసినదే! ఒక్క రాణి చీమ కొన్ని లక్షల చీమలకు జన్మనిస్తుందన్న విషయం మీకు తెలుసా? వినడానికే మీకు గగుర్పాటుగా ఉందా? అయితే కొన్ని సులువైన చిట్కాలతో చీమలను మన ఇంటికి దూరంగా నెట్టేయవచ్చు.
ువంటింట్లో మనం సాధారణంగా ఉపయోగించే వెనిగర్‌ను, నీటిని సమానంగా కలిపి చీమలు ఎక్కువగా తిరుగాడే వంట గది గట్టు, అల్మరాలను శుభ్రం చేయండి. ఇలా ఒకే రోజు నాలుగైదు సార్లు చేసి మంచి ఫలితం పొందండి. చీమలు వెనిగర్ వాసనను ఇష్టపడవు. అంతేకాక వెనిగర్ సువాసన చీమలు ఏర్పాటు చేసుకునే బాటలను తుడిచివేస్తుంది.
ు చీమలు ఎక్కువగా ఉన్న చొట్లలో నిమ్మ, నారింజ తొక్కలను ఉంచండి. ఈ పండ్ల తొక్కలలో ఉండే రసాయనాలు చీమలకు ఆహారంగా ఉపయోగపడే శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. కనుక చీమలు వెంటనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోతాయి.
ుచీమలు పిండి ఉండే ప్రదేశంలో సంచరించవు కనుక వంటగదిలో ఉండే అల్మరాలలో, చీమలు ప్రవేశించే చోట్లలో పిండిని వెదచల్లండి.
ు చీమలు మన ఇంట్లోకి ప్రవేశించే తలుపులు, కిటీలలు ఉన్న చోట్లలో ఉప్పును చల్లండి. ఉప్పును దాటి చీమలు ఇంటి లోనికి ప్రవేశించవు.