Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధ్యమైనంత వరకూ హెయిర్ స్టయిలింగ్ చికిత్సలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు జుట్టును తాత్కాలికంగా మెరిపించినా దీర్ఘకాలికంగా సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి వాటిని వాడక పోవడమే మంచిది.
జుట్టు మరీ పొడిగా కనిపిస్తుంటే కలబంద గుజ్జు లేదా పెరుగును ఉపయోగించాలి. ఇవి మంచి కండీషనర్లుగా పని చేస్తాయి. రెండు చెంచాల పెరుగులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అర గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే మంచి జుట్టు మెత్తగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే కలబంద గుజ్జును పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా, నూనె లేకుండా ఉంచుకోవాలి. అందుకోసం తరచూ తలస్నానం చేస్తుండాలి. దాని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని రోజూ తల స్నానం చేస్తే తలలోని సహజ నూనెలు పోతాయి. దాంతో జుట్టు ఎదుగుదల తగ్గుతుంది. వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
తలస్నానం కోసం గోరువెచ్చటి లేదా చల్లని నీటిని మాత్రమే వాడాలి. అప్పుడప్పుడూ కొబ్బరి నూనెను వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకుని అరగంటయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.ు