Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు పురుషులతో పోటీ పడి అన్ని రంగాల్లోనూ వారికి సమానంగా దూసుకెళ్తున్నారు. కానీ ఒకప్పు. పురుషాధిక్య సమాజంలో కొన్ని వృత్తుల్లోకి ఆడవారికి ప్రవేశమే ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఆటోమోబైల్రంగం. ఆటోడ్రైవర్లు అంటే మగవారే... కానీ.. ఆ సమయంలోనే ఓ మహిళ స్టీరియోటైప్స్ను బద్ధలు కొట్టింది. ఛాలెంజింగ్‌గా ఆటోడ్రైవర్ వ త్తిని స్వీకరించింది. అందులో విజయవంతంగా దూసుకెళ్లింది. తనలాంటి ఎంతో మంది మహిళలకు ఆమె ప్రేరణగా నిలిచింది. ఆమే.. పుణేకి చెందిన షీలా దావ్రే.
షీలా దావ్రేది మహారాష్ట్రలోని పర్బని. అక్కడే పుట్టి పెరిగింది. 18 ఏళ్లు వచ్చే వరకు అక్కడే ఉంది. అయితే ఆమెది చాలా పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడేది కాదు. దీంతో తల్లిదండ్రులకు భారంగా ఉండొద్దని 1988లో ఊరుని వదిలి పుణేకు చేరుకుంది. అక్కడే మహిళా సంఘాల సహాయంతో స్వయం ఉపాధి కోసం అవకాశాలను వెతికింది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. అయితే మొదట్లో ఆమె ప్రతిపాదనను కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. దీంతో పుణేలో తన ఇంటి వద్ద ఉండే ఆటో డ్రైవర్లు సెలవులో ఆటో ఇంటి వద్ద వదిలి వెళితే అలాంటి ఆటోలను షీలా నడిపేది. ఈ క్రమంలో అలా తాను సంపాదించే ఒక్కో రూపాయిని పోగు చేసింది. తానే సొంతంగా ఆటో కొనుక్కుంది. దీంతో ఆమెకు కష్టాలు తీరిపోయాయనే చెప్పవచ్చు. ఆ సమయంలోనే మరో ఆటోడ్రైవర్‌తో ఆమె వివాహం అయింది. అయితే షీలా ఆటో నడిపే మొదట్లో చాలా మంది ఆమె ఆటోలో ఎక్కేందుకు విముఖత ప్రదర్శించేవారు. లేడీ ఆటోడ్రైవర్ ఏంటీ.. ఆమె ఆటో బాగా నడుపుతుందా.. సేఫ్‌గా తమను తీసుకెళ్తుందా.. అని చాలా మంది ఆలోచించే వారు. దీంతో ఆమెకు ప్రయాణికులు లభించే వారు కాదు. కానీ ఆమె పట్టు కోల్పోలేదు. నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించింది. చివరకు సొంత ఆటోకు ఓనర్ అయింది. అలా షీలా 1988లో ఆటోడ్రైవర్ అవగా, మన దేశంలో ఆటోడ్రైవర్ అయిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. దీంతో ఆమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చేరింది. అయితే కేవలం ఆటోమాత్రమే కాదు, స్కూల్ పిల్లల వ్యాన్లు, బస్సులను కూడా షీలా నడిపేది. అలా 1988 నుంచి 2001 వరకు ఆమె డ్రైవింగ్ చేసింది. తరువాత అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆ పని మానేసింది. అయినప్పటికీ ఆమె ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలిచింది. చాలా మంది మహిళలు ఆటోడ్రైవర్లు అయ్యేందుకు తన వంతు సహాయం చేసింది! ు