Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు రంగుల కలయికతో ముచ్చటగొలిపే విధంగా ఉంటుంది హాఫ్ సారీ. పార్టీ, అకేషన్ ఏదైనా సరే హాఫ్ సారీ ప్రత్యేకతే వేరు. చీర సగం వరకు ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉండి మిగతా సగం ప్లేన్‌గా ఉంటుంది. ముదురు గులాబీ రంగుకు పింక్ కలర్ మిక్స్ అయితే చాలా అందంగా, డిఫరెంట్‌గా కనిపిస్తుంది, అలాగే ఎరుపు రంగు చీర మీద బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ వర్క్ మగువల మనసు దొచేస్తుంది. పసుపు రంగు ప్లేన్ పట్టు చీరకు గులాబీ రంగు కలగలిస్తే ఆ చీర అందమే వేరు. ఇక హాఫ్ సారీ మీదకు ఆపోజిట్‌గా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజు చీరకే మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఇది హుందాగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే ఈ సారి పార్టీకి ఓ సారి ప్రయత్నించి చూడండి!