Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం చివరి రోజుల నుంచి మనకు ఎక్కడ చూసినా కనిపించేవి ద్రాక్షలు. వేసవిసీజన్లో సైతం లభించే ఈ ద్రాక్ష పండ్లతో ఎన్నో లాభాలున్నాయి. అందుకే రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ద్రాక్షలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.
విటమిన్ల ఖని... ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమ ద్ధిగా లభిస్తాయి.
గుండెకు రక్ష.. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగిస్తాయి. ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచి, రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. దీంతో గుండెపోటు అవకాశం తగ్గుతుంది.
మలబద్దకానికి.. ద్రాక్షల్లో కర్బన ఆమ్లాలు, సెల్యులోజ్ లాంటి చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మంచి లాగ్జేటివ్స్గా పనిచేస్తాయి. కాబట్టి మలబద్దకంతో బాధపడుతున్నవారికి ద్రాక్షపండ్లు మంచి మందుగా పనిచేస్తాయి. అజీర్తి నుంచి బయటపడేయడానికి సహాయపడతాయి. ద్రాక్షల్లో ఇనుము సమ ద్ధిగా ఉండటం వల్ల రక్తవృద్ధి జరిగి అలసట, నీరసం లాంటివన్నీ మటుమాయం అవుతాయి. ద్రాక్షల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొన్ని రకాల బాక్టీరియా, వైరస్ల ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో కూడా ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. ద్రాక్షలు యూరిక్ ఆమ్లం మోతాదు తగ్గించి కిడ్నీలపై పనిభారం పడకుండా చేస్తాయి.
క్యాన్సర్ మందు... నల్లద్రాక్ష రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ద్రాక్షల్లోని రిస్వెరటాల్ చూపించే యాంటి ఇన్ఫ్లమేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్వెరటాల్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంథ్రోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి.
కంటి ఆరోగ్యానికి... వయసు పెరిగినకొద్దీ దాడిచేసే వ్యాధుల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. దీనివల్ల మెల్లమెల్లగా ద ష్టి సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ప్రతిరోజూ ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్ డీజనరేషన్ అవకాశం 36 శాతం తగ్గిపోతుంది. రోజూ ద్రాక్షలు తీసుకుంటే కంటిలో శుక్లాలు ఏర్పడే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి.
చిట్కావైద్యం.. ఇలాంటి ఎన్నోరకాల జబ్బుల నివారణలో ద్రాక్షపండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే చేసుకునే చిట్కావైద్యాలకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. బాగా పండిన ద్రాక్ష పండు పార్శపు తలనొప్పి (మైగ్రేన్)కి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే పరగడపున నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ు